ANDHRA PRADESH
Trending

పులివెందులకు సీఎం జగన్ ‘ఇంటర్నేషనల్’ గిఫ్ట్…

తన సొంత నియోజకవర్గం పులివెందుల, సొంత జిల్లా కడప అభిృద్ధికి సంబంధించి జరుగుతున్న పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కడప, పులివెందుల అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ (పాడా)లపై జగన్ సమీక్షించారు. క్యాంప్ కార్యాలయంలో అధికారులతో జగన్ సమావేశమయ్యారు. శాఖల వారీగా చేపడుతున్న పనులు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఇరిగేషన్‌ పనులపై సమీక్షించారు. పులివెందులలో మెడికల్‌ కాలేజీ పనులపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. క్యాన్సర్‌ హాస్పటిల్, ఇతరత్రా అభివృద్ధిపనుల పనుల వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చేసిన శంకుస్థాపనలు, పనులకు సంబంధించి ప్రశ్నించారు. పనుల ప్రగతి, నిధుల ఖర్చు, ఇతరత్రా అంశాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

గ్రామాల వారీగా గోదాములు, మండలాల వారీగా కోల్డ్‌స్టోరేజీలు, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఫుడ్‌ ప్రాససింగ్‌ జోన్లపై మ్యాపింగ్‌ చేయించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. స్కిల్‌ డెవలప్‌ సెంటర్లన్నీ ఒకే తరహా నమూనాలో ఉండాలని సూచించారు. ఈసారి వరద నీళ్లు వచ్చినప్పుడు గండికోట, చిత్రావతి తప్పనిసరిగా నిండాలని, ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ముద్దనూరు–కొడికొండ చెక్‌పోస్టు వరకూ రోడ్డు విస్తరణ పనులపై దృష్టిపెట్టాలని, ఈపనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సీఎం ఆదేశించారు.

ఖర్జూరం పెంపకంపై కొందరు రైతులు ఆసక్తి చూపుతున్నారని అధికారులు మఖ్యమంత్రికి తెలియజేశారు. వాతావరణం, ఖర్చులు ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దానిపై అధ్యయనం చేయించాలని సీఎం ఆదేశించారు. చిరుధాన్యాలను బాగా ప్రమోట్‌ చేయాలని జగన్ సూచించారు. వీటితోపాటు పులివెందులలో ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడి బోధన అందించే ఒక స్కూల్‌ (ఇంటర్నేషనల్ స్కూల్) ఏర్పాటుకు దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. అలాగే, టౌన్‌ హాలు నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సూచించారు.

Tags

Related Articles

Back to top button
Close