SPIRITUAL

నేటి నుంచి మేడారం మహా జాతర షురూ

నాలుగు రోజుల పాటు జాతర - మహా జనసంద్రంగా మేడారం

గిరిజన దండు కదిలింది.. దైవ భక్తితో భక్తజనం బైలెల్లినరు.. అటు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద, గోవింద రాజులు భక్తులకు దర్శనం ఇచ్చేందుకు, కోరికలు తీర్చేందుకు జనంలోకి వస్తున్నరు.. మొత్తంగా మేడారం మహా జనసంద్రమైంది. మంగళవారం నుంచే భక్తులు మేడారానికి తరలివస్తున్నరు.. మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా వాహనాలన్నీ ఎడతెరపి లేకుండా మేడారానికి వస్తూనే ఉన్నాయి. పస్రా, తాడ్వాయి, కాటారం, చిన్నబోయినపల్లి రూట్లలో సమ్మక్క దర్శనానికి వస్తున్నరు.. ఫలితంగా అడవిలో ఇసుకేస్తే రాలనంత జనం. కాగా, నేటి నుంచి జాతర షురూ అవుతోంది. నేటి నుంచి 8వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు జరుగనుందీ జాతర. తెలంగాణా కుంభమేళాగా పిలిచే మేడారం జాతరకు ఆంద్రప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒరిస్సా, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలలోని గిరిజనులు, గిరిజనేతరులే కాకుండా విదేశీ భక్తులు కూడా వస్తున్నారు.

మేడారం జాతరకు కేసీఆర్ సర్కారు రూ.75కోట్లను కేటాయించింది. దాదాపు కోటిన్నర మంది భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది. అదనపు స్నానఘట్టాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, అంతర్గత రోడ్లు, పారిశుధ్య కార్యక్రమాలు, నిరంతర విద్యుత్తు సరఫరా, వైద్య సదుపాయాలను పూర్తి చేసింది.

Tags
Back to top button
Close