Breaking NewsNATIONAL

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంతో ఎవ‌రికీ న‌ష్టం జ‌ర‌గ‌దు: ర‌జ‌నీకాంత్

దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌కు దారితీస్తున్న పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంపై.. త‌మిళ ఫిల్మ్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న అభిప్రాయాన్ని వినిపించారు.   పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంతో ఎవ‌రికీ ఇబ్బంది ఉండ‌ద‌న్నారు.  దేశ పౌరుల‌పై సీఏఏ ప్ర‌భావం ప‌డ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన ర‌జ‌నీ.. ఒక‌వేళ సీఏఏ వ‌ల్ల ముస్లింల‌కు న‌ష్టం జ‌రిగితే, వారి త‌ర‌పున పోరాడేందుకు తానే మొద‌టి వ్య‌క్తిని అవుతాన‌న్నారు.  జాతీయ జ‌నాభా ప‌ట్టిక‌(ఎన్‌పీఆర్‌) వ‌ల్ల దేశంలో ఉన్న అక్ర‌మ విదేశీయుల లెక్క తెలుస్తుంద‌ని ర‌జ‌నీ అన్నారు. జాతీయ పౌర జాబితాపైన కూడా సూప‌ర్ స్టార్ స్పందించారు.  ఎన్సార్సీ అమ‌లుపై ప్రభుత్వం ఇంకా  ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు.

జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)ని దేశవ్యాప్తంగా అమలు చేయడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంగ‌ళ‌వారం కేంద్రం పేర్కొన్న విష‌యం తెలిసిందే. అదే విధంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌) కోసం వివరాలు సేకరించే సమయంలో పౌరుల నుంటి ఎటువంటి పత్రాలు కోరబోమని స్పష్టం చేసింది. నిన్న లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్‌రాయ్‌ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. జాతీయ స్థాయిలో భారతపౌరుల జాబితాను సిద్ధం చేయడంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు అని పేర్కొన్నారు.

Tags

Related Articles

Back to top button
Close