Breaking NewsNATIONAL

నిర్భయ దోషులకు వారం రోజుల గడువు

నిర్భయ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దోషుల ఉరిశిక్షపై స్టేను ఎత్తివేసి శిక్షించాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. డెత్‌ వారెంట్లపై స్టే విధించిన పటియాలా హౌస్‌ కోర్టు తీర్పును పక్కన పెట్టేందుకు కోర్టు నిరాకరించింది. శిక్ష అమలు జాప్యానికి చేసే ప్రయత్నాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకున్నది. వారం లోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత నిబంధనలకు అనుగుణంగా వెళ్లాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దోషులకు విడివిడిగా ఉరిశిక్ష అమలు చేయడం కుదరదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

Tags

Related Articles

Back to top button
Close