Breaking NewsNATIONAL
Trending

రామమందిర నిర్మాణంపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ కీలక ప్రకటన

అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు ప్రధాని నరేంద్రమోదీ. రామజన్మభూమి తీర్థ ట్రస్ట్‌ను కేంద్రం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. మందిర నిర్మాణంపై ట్రస్ట్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని మోదీ ప్రకటించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ట్రస్ట్ గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ట్రస్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. రామమందిర ప్రాంతం కోసం 67 హెక్టార్ల భూమిని ట్రస్ట్‌కు అప్పగిస్తున్నామని ఆయన తెలిపారు. రామమందిరం నిర్మాణానికి అందరూ సహకరించాలని ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు.

సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా 5 ఎకరాలు వక్ఫ్ బోర్డుకు ఇచ్చేందుకు యూపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని తెలిపారు. అయోధ్యలోని వివాదాస్పద భూమి రామజన్మస్థలమే అని గత నవంబర్‌లో ఇచ్చిన తుది తీర్పులో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు… అక్కడ మందిర నిర్మాణానికి వీలుగా మూడు నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుకు తగ్గట్టుగానే ట్రస్ట్‌పై కేంద్రం నిర్ణయం తీసుకోగా… ఇందుకు సంబంధించి పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీ అధికారిక ప్రకటన చేశారు.

Tags

Related Articles

Back to top button
Close