Breaking NewsTELANGANA

సీఎంగా కేటీఆర్‌…

సమ్మక్కను మొక్కుకున్న టీఆర్ఎస్ నేత

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని అనేకమంది టీఆర్ఎస్ నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ యువనేత, మాజీ స్పీకర్ మధుసూధనాచారి కుమారుడు ప్రశాంత్ మరో అడుగు ముందుకేశారు. కేటీఆర్‌ను సీఎం చేయాలంటూ సోమవారం మేడారంలో సమ్మక్క సారలమ్మను మొక్కుకున్నారు ప్రశాంత్. సుమారు వెయ్యి మంది యువకులు భక్తితో ర్యాలీగా మేడారం చేరుకొని వనదేవతల గద్దెల వద్ద మొక్కు చెల్లించారు. ప్రపంచదేశాలలోని పారిశ్రామిక వేత్తలతో సంబంధాలు కలిగి ఉండటంతో పాటు, పార్టీని క్రమశిక్షణతో ముందుకు నడిపించగల సత్తా కేటీఆర్‌కు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని ఏకతాటిపై నడిపించి పూర్తి విజయాన్ని చేకూర్చినందుకు కేటీఆర్‌ను సిరికొండ ప్రశాంత్‌ కొనియాడారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన సుమారు 15 గ్రామాలకు చెందిన యువకులు పాల్గొన్నారు.

Tags

Related Articles

Back to top button
Close