Breaking NewsNATIONALTELANGANA

పసుపు రైతులకు శుభవార్త…

నిజామాబాద్‌లో స్పైస్ బోర్డు రీజనల్ సెంటర్

నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయిచింది. ఈ మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత డివిజనల్ స్థాయి కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయికి కేంద్రం పెంచనుంది. ఐఏఎస్ హోదా డైరెక్టర్ స్థాయి అధికారితో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. ప్రాంతీయ కార్యాలయం నేరుగా కేంద్ర మంత్రిత్వశాఖకు నివేదించనుంది. పసుపు, మిరప పంటను దృష్టిలో పెట్టుకునే ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపిన పీయూష్ గోయల్ వివరించారు.

ఈ నిర్ణయంతో నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఇప్పటివరకు కేరళలో స్పైసెస్ బోర్డు ఉండగా… తాజాగా తెలంగాణలో ఇందుకు సంబంధించిన మరో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పసుపు పంట నాణ్యత, మద్దతు ధర అంశాన్ని ఈ బోర్డు పర్యవేక్షించనుంది. నిజామాబాద్ రైతులు కోరిన దానికంటే ఎక్కువే ఇచ్చామని కేంద్రమంత్రి తెలిపారు. ఇది నిజామాబాద్ రైతులకు కేంద్రం ఇచ్చిన బహుమతి అని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.

Tags

Related Articles

Back to top button
Close