Breaking NewsINTERNATIOALNATIONALTELANGANA

ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండా కేసులో తుది తీర్పు వాయిదా

దేశ వ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో నిందితుడిగా ఉన్న తుండా

ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండా కేసులో తుది తీర్పు వాయిదా పడింది. తుండా కేసును MSJ కోర్టు ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. ఇప్పటికే యూపీలోని ఘజియాబాద్ జైల్లో ఉన్న కరీమ్ తుండాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఐతే విచారణ అనంతరం తుండా కేసులో తుది తీర్పును ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది కోర్టు. కాగా, దేశ వ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో తుండా నిందితుడిగా ఉన్నాడు. ఆయా దాడుల తర్వాత కొన్ని రోజుల పాటు పాకిస్తాన్ లో తలదాచుకున్నాడు. రెండేళ్ల క్రితం నేపాల్ సరిహద్దుల్లో కరీంను పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఇతను 1990లో యువకులను ఉగ్రవాదంపై మళ్లించాడు. పిటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకవచ్చింది సిట్. హైదరాబాద్ లో జరిగిన పలు పేలుళ్ల కేసులలో తుండా హస్తం ఉంది. ఈరోజు తుది తీర్పురానుంది. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న తుండాను ఇవాళ హైదరాబాద్‌కు తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. తుండాపై ఆంసాట్, నకిలీ పాస్ పోర్టుల కేసులున్నాయి. పాకిస్తాన్ బంగ్లాదేశ యువకుల్ని ఉగ్రవాదంపై ఆకర్షితుల్ని చేసి శిక్షణ కూడా ఇచ్చాడు కరీమ్ తుండా. 1998లో గణేష్ ఉత్సవాల్లో బాంబ్ బ్లాస్ట్‌కు ప్లాన్ చేశాడన్న అభివయోగాలు కూడా ఇతనిపై ఉన్నాయి.

Tags

Related Articles

Back to top button
Close