ANDHRA PRADESHBreaking NewsLATEST NEWSNATIONALTELANGANA
Trending

నిర్భయ దోషులకు జైలులో ఆంక్షలు విధించిన అధికారులు

దోషులు ఒకరితో మరొకరు మాట్లాడుకోకుండా ఆంక్షలు

మరికొన్ని రోజుల్లో ఉరికి సిద్ధమవుతున్న నిర్భయ దోషులకు తీహార్ జైలులో అధికారులు ఆంక్షలు విధించారు. దోషులు నలుగురు ఒకరినొకరు కలుసుకోకుండా, మాట్లాడుకోకుండా వేర్వేరు గదుల్లో ఉంచారు. దోషులు ముకేశ్‌, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌సింగ్‌‌లు ఇప్పటి వరకు జైలులో ఉదయం వేళ ఒకరినొకరు కలిసి మాట్లాడుకునేవారు. అయితే, ఉరితీత సమయం దగ్గర పడుతుండడంతో వారు కలుసుకుని మాట్లాడుకోకుండా నిషేధం విధించారు.

మరోవైపు, తీహార్ జైలులో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం తమిళనాడు నుంచి ప్రత్యేక పోలీసు దళాన్ని రప్పించారు. మండోలీ జైలులో ఉన్న మరో దోషి పవన్ కుమార్ గుప్తాను అత్యంత రహస్యంగా సాయుధ గార్డుల భద్రత మధ్య తీహార్ జైలుకు తీసుకువచ్చారు. జైలులోని ఉరితీసే గదిని శుభ్రం చేశారు. తుప్పు పట్టిన ఉరిస్తంభాన్ని శుభ్రం చేయించి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.

Tags

Related Articles

Back to top button
Close