Breaking News
Trending

తప్పతాగి పట్టాలపై స్పృహ లేకుండ పడిపోయిన ధర్మేంద్ర

మధ్యప్రదేశ్ లో ఘటన

అసలే తప్పతాగున్నాడు. ఒళ్లు తెలియకుండ నడుస్తూ వెళ్లి, రైలు పట్టాలపై స్పృహ లేకుండా పడిపోయాడు. అతని పై నుంచి మూడు రైళ్లు వెళ్లాయి. ఆపై మత్తు వదలగా, నిద్ర నుంచి లేచినట్టుగా లేచాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. అతని పేరు ధర్మేంద్ర. పట్టాలపై పడివున్న ఓ వ్యక్తిని గమనించిన రైలు డ్రైవర్, వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే సరికి, ఆ దారిలో మూడు రైళ్లు వెళ్లాయి. పోలీసులు వచ్చిన తరువాత ధర్మేంద్ర లేచాడు. అతని శరీరంపై ఒక్క గాయం కూడా లేకపోవడాన్ని చూసిన పోలీసులు.. తాగుబోతే అయినా, మృత్యుంజయుడని అంటూ, మందలించి పంపారు.
Tags

Related Articles

Back to top button
Close