Breaking News
Trending

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి

మహేశ్ సినిమా నుంచి దీపావళికి విజయశాంతి ఫస్టులుక్

అందం .. అభినయం కలగలిసిన నిన్నటితరం కథానాయికలలో విజయశాంతి ఒకరు. 2006లో ‘నాయుడమ్మ’ సినిమా తరువాత విజయశాంతి రాజకీయాలలో బిజీ అయ్యారు. ఆ కారణంగా ఆమె సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చారు. మళ్లీ ఇంతకాలానికి .. అంటే 13 ఏళ్ల తరువాత ఆమె ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

ఈ సినిమాలో ఆమె రాయలసీమకి చెందిన పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి విజయశాంతి లుక్ ఎలా వుండనుందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆ రోజున ఆమె ఫస్టులుక్ ను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. మహేశ్ బాబు .. రష్మిక జంటగా నటించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.

Tags

Related Articles

Back to top button
Close