Breaking News
Trending

చిరూతో సినిమాకి కొరటాల సన్నాహాలు

వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్

కొరటాల – చిరంజీవి కాంబినేషన్లో రూపొందనున్న సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. వచ్చేనెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే చరణ్ .. కొరటాలతో ఈ సినిమా బడ్జెట్ గురించి మరోసారి చర్చించినట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత వరకూ బడ్జెట్ ను నియంత్రిస్తూ వెళ్లమని ఆయనకి సూచించినట్టు సమాచారం.

ఈ ప్రాజెక్టుకు ముందు చరణ్ ‘సైరా’ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ సినిమా కంటెంట్ పరంగా శభాష్ అనిపించుకుంది. ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా, వసూళ్లపరంగా ఆశించినస్థాయి వేగాన్ని చూపలేకపోతోంది. ఈ కారణంగానే తమ సినిమా బడ్జెట్ పరిథిని దృష్టిలో పెట్టుకుని, ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటు ముందుకు వెళ్లాలని కొరటాలకి చరణ్ చెప్పాడని అంటున్నారు. మొత్తానికి కొరటాలకి మరికొంత బాధ్యత పెరిగినట్టే.

Tags

Related Articles

Back to top button
Close