Breaking News
Trending

టీఆర్ఎస్ నేతల సరదా..

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, పార్లమెంటు సభ్యుడు మన్నెం శ్రీనివాసరెడ్డి ఈరోజు  మహబూబ్ నగర్ జిల్లాలోని అలీపూర్ చెక్ డ్యామ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం చెక్ డ్యామ్ ను ప్రారంభించిన నేతలు, తమ అనుచరులతో కలిసి బ్యాక్ వాటర్ వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా డ్యామ్ లోకి దూకిన ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి, మన్నెం శ్రీనివాసరెడ్డి ఈత కొడుతూ సరదాసరదాగా గడిపారు. ఈ కార్యక్రమానికి అధికారులతో పాటు స్థానిక టీఆర్ఎస్ శ్రేణులు భారీగా హాజరయ్యాయి.

Tags

Related Articles

Back to top button
Close