Breaking News
Trending

ఐఏఎస్ అధికారుల్ని రంగంలోకి దించండి!: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డిమాండ్

తెలంగాణలో ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, యూరియా వంటి ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఇతర వ్యవసాయ శాఖ ఆఫీసుల ముందు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ నేత, లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చాలా దుర్భరమైన స్థితిలో ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణ లోపం కారణంగానే తెలంగాణలో యూరియా కొరత తలెత్తిందని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రతీ జిల్లాకు ఓ ఐఏఎస్ అధికారిని స్పెషల్ ఇన్ చార్జీగా నియమించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితిని వెంటనే సరిదిద్దాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

Tags

Related Articles

Back to top button
Close