Breaking News
Trending

పిల్లలు జ్ఞానవంతులు కావాలి

పండిట్ : భరత్ కుమార్ శర్మ సంకేపల్లి

పిల్లలు సమాజ వికాసానికి ఉపయోగపడే విద్యను అభ్యసించి, శాస్త్ర- సాంకేతిక పరిజ్ఞానంతో దేశ పురోభివృద్ధికి చక్కని పూల బాట వేయాలి. క్రమశిక్షణతో విద్యను అభ్యసించి తల్లిదండ్రుల యందు గౌరవమర్యాదలు కలిగి ఉండాలి. ప్రతి జీవిపై ప్రేమ కలిగి ఉండటంతో పాటు విశ్వాన్ని ముందుకు నడిపించే సమస్త విషయ పరిజ్ఞానంలో ఏకాగ్రతతో, పట్టుదలతో నేర్పరియైు ముందుకు సాగిపోతుండాలి.

 తల్లిదండ్రులు పిల్లల్లో నిజాయితీతో కష్టపడి చదివే గుణం పెంచి, దుర్గుణములకు లోనవక చెడులను వీడి ప్రకృతిలోని సమస్త వనరులను తయారు చేసేటటువంటి శక్తిమంతులు కావాలి. విశ్వం సస్యశ్యామలంగా, ప్రపంచం అంతా ఏ లోటు లేకుండా శాంతిపథంగా నడిచేటట్లుగా నడుచుకోవాలి. అలా ఉన్నప్పుడే దేశ పురోభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది.

 పిల్లలయందు తల్లిదండ్రులు చేస్తున్న కృషి గురువుల ఆశీర్వచనం, భగవంతుని అనుగ్రహం ఉంటుంది. ప్రతి పౌరుడు ఐ.ఏ.యస్‌, ఐ.పి.యస్‌, ఐ.ఆర్‌.ఎస్‌, ఎమ్‌బిబియస్‌, బిటెక్‌ లు చదివి దేశాన్ని ఎంతో ముందుకు తీసుకుపోవాలని ప్రతి చిన్నారి సాధన జరుగుతుంది.

 తల్లిదండ్రుల కృషి ఉన్నా, గురువుల ఆశీర్వచనం ఉన్నా, పిల్లల సాధన ఉన్నా చాలా మంది ముందుకు అడుగు వేయలేని స్థితి కనబడుతుంది. చదువుయందు బుద్ధి నిలబడలేక చదివింది గుర్తురాక, తాము అనుకున్న స్థానానికి చేరుకోలేక అనేకమంది విద్యార్థులు టెన్షన్‌కి గురౌవుతుంటారు. అలా అనుకున్నవి సాధించటానికి  విద్యను వ్యాపారంగా మలుచుకొని ఖరీదైన విద్యాసంస్థలుగా పెరుగాంచిన విద్యాసంస్థలపై తల్లి దండ్రులు మక్కువ చూపుతున్నారు ! కానీ నేటి సమాజములో కావల్సింది ఖరీదైన కాంన్వెంట్ చదువులు కాదు. అర్థవంతమైన సంస్కారముతో కూడిన విద్య!!

అందుకే మన భారతీయ సంస్కృతి మనకు చెప్పిన సూత్రాలలో ప్రధానమైనది “తల్లి ఓడి మొదటి బడి” అని మరి ఆనానుడి మరచి నేటి యాంత్రిక జీవనములో మన పిల్లల భవిష్యత్తును మనమే కాలరాసుకొని వారి బంగారు జీవనాన్ని ఆదిలోనే త్రుంచివేస్తున్నాము. ఇలాంటి ఈ పరిస్థితుల్లో అప్పుడే పలుకుట ప్రారంభించిన శిశువు నుండి పాఠశాల విద్యాభ్యాసం పూర్తయ్యో వరకు వారికి మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించి చూడండి . సంస్కారంతో నేర్పిన పాఠం సమాజాన్ని సంస్కరించే ఒక ఉజ్వల భవితవ్యానికి పునాధి వేస్తుంది.

కాన్వెంట్ లో చెప్పే పాఠం కంటే కన్నతల్లి చెప్పే పాఠం పిల్లలను ప్రయోజనవంతులను చేస్తుంది. కార్పోరేట్ పాఠశాల కంటే కన్నతల్లి ఓడి కమ్మని జ్ఞాన సంపదను అందిస్తుంది. అందుకే భారతీయులుగా మన వారసత్వ సంపదగా చెప్పుకొనే సంస్కృతి సాంప్రదాయాలను మన పిల్లలకు అందించి … గురుపూజోత్సవం సందర్భంగా “తల్లే మొదటి గురువు” అన్న భావనకు సంకేతంగా ప్రతి మాతృమూర్తి తన పిల్లలను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దే సద్గురువుగా తన పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ … దేశ సౌభాగ్యం కోసం అమృత బిందువులాంటి మహామహులను జాతికి అందించిన తొలి గురువులకు పాదాభివందనలు అర్పిస్తూ… “పిల్లలు జ్ఞానవంతులు కావాలి – దేశ సౌభాగ్యం విల్లివిరయాలని ఆకాంక్షిస్తూ …….

మీ

భరత్ కుమార్ శర్మ

(ప్రధాన సంపాదకులు – హైందవ సంస్కృతి మాస పత్రిక)

PH : 8686865615

Related Articles

Back to top button
Close