Breaking News
Trending

‘సాహో’ నుంచి కొత్త పోస్టర్ .. అదిరిపోయే లుక్ తో ప్రభాస్

ప్రభాస్ తాజా చిత్రంగా 'సాహో'

ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా శ్రద్ధా కపూర్ కనిపించనుంది. ఈ సినిమా నుంచి ఈ రోజు ఒక సర్ ప్రైజ్ ఉంటుందని నిన్ననే ఒక వీడియో బైట్ ద్వారా ప్రభాస్ చెప్పాడు. అన్నట్టుగానే కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను విడుదల చేశారు.

డిఫరెంట్ లుక్ తో .. చాలా తీక్షణమైన చూపులతో ప్రభాస్ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ‘బాహుబలి 2’ తరువాత ప్రభాస్ చేస్తోన్న సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు ఎక్కువగా వున్నాయి. ఎంతోమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసమే ప్రభాస్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు

Tags

Related Articles

Back to top button
Close