Breaking News

సినిమాల్లో ‘స్పెషల్ ఎఫెక్ట్స్ కింగ్’ ఏక్ నాథ్ మృతి

గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే చారిత్రక, జానపద చిత్రాల్లో స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా రక్తికట్టించిన ప్రముఖ సినీ టెక్నీషియన్ ఏక్ నాథ్ (70) కన్నుమూశారు. ఏక్ నాథ్ మృతిపై టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. ఏక్ నాథ్ కుటుంబసభ్యులకు పలువురు ప్రముఖులు పరామర్శించారు.

కాగా, విఠలాచర్య దర్శకత్వంలో వచ్చిన చాలా చిత్రాలకు ఏక్ నాథ్ స్పెషల్ ఎఫెక్ట్స్ అందించారు. త్రీ డీ సినిమాలకు ఎఫెక్ట్స్ డైరెక్టర్ గా  పనిచేశారు. అగ్ర హీరోలు నటించిన సినిమాలకు ఆయన సేవలందించారు. ఏక్ నాథ్ తన సినీ కెరీర్ లో సుమారు 700 చిత్రాలకు పైగా స్పెషల్ ఎఫెక్ట్స్ అందించారు. ఏపీలోని మచిలీపట్నానికి చెందిన ఏక్ నాథ్ ప్రముఖ కెమెరామెన్ మోహనకృష్ణకు సోదరుడు.

Tags

Related Articles

Back to top button
Close