Breaking News
Trending

మరికాసేపట్లో రోదసిలోకి పీఎస్ఎల్వీ-సి45 రాకెట్

శ్రీహరికోటలో సర్వం సిద్ధం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి భారీ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రం షార్ నుంచి సోమవారం ఉదయం పీఎస్ఎల్వీ-సి45 రాకెట్ రోదసిలోకి దూసుకెళ్లనుంది. ఉదయం 9.27 గంటలకు రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ మేరకు షార్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రయోగం కోసం ఆదివారం ఉదయం 6.27 గంటల నుంచి కౌంట్ డౌన్ మొదలైంది. కాగా, పీఎస్ఎల్వీ పరంపరలో ఇది 47వ ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా మనదేశానికి చెందిన ఎమిశాట్ (ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మెజర్ మెంట్) ఉపగ్రహంతో పాటు ఇతర దేశాలకు చెందిన మరో 28 నానో ఉపగ్రహాలను కూడా పలు లక్ష్యల్లో ప్రవేశపెడతారు.

Tags

Related Articles

Back to top button
Close